Rahul Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పై అధికార బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్‌గాంధీని ఒక అబద్ధాల దుకాణంగా అభివర్ణించింది. రాహుల్‌గాంధీ తనను తాను ఒక అబద్ధాల దుకాణం (Shop of lies) గా నిరూపించుకుంటున్నారని వ్యాఖ్యానించింది.
లోక్‌సభలో వందేమాతరంపై, ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతుంటే ప్రతిపక్షం తేలిపోయిందని విమర్శించింది. కాంగ్రెస్ తీరును ఎండగడుతుంటే కాంగ్రెస్ సభ్యులు బిత్తరపోయారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా ఎద్దేవా చేశారు.
వందేమాతరంపై, ఎన్నికల సంస్కరణలపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చల సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు అద్భుత ప్రదర్శన కబరిచారన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై శుక్లా స్పందించారు. ప్రతిపక్ష సభ్యులు చర్చలో తేలిపోయారని పేర్కొన్నారు.