Dominic and the Ladies’ Purse | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) రూపొందించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ (Dominic and the Ladies’ Purse). ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు 11 నెలలు గడిచిన ఇప్పటివరకు డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వలేదు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5)లో ఈ చిత్రం డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటించింది. మమ్ముట్టి నటన, గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మమ్ముట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ డొమినిక్గా నటించారు. డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన అనంతరం ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌గా పని చేస్తుంటాడు. ఆయన అసిస్టెంట్ విక్కీ పాత్రలో యువ నటుడు గోకుల్ సురేశ్ కనిపించారు. ఓ సందర్భంలో డొమినిక్‌కు ఒక లేడీస్ పర్స్ లభిస్తుంది. ఈ పర్స్ ఎవరిది అనే విషయం పరిశోధిస్తుండగా.. అది అప్పటికే అదృశ్యమైన పూజ అనే అమ్మాయికి చెందినదని తెలుస్తుంది. పూజ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో, పర్స్‌కు, పూజ హత్యకు ఉన్న సంబంధం ఏంటి? పూజను ఎవరు హత్య చేశారు? ఆమె బాయ్‌ఫ్రెండ్ కార్తీక్ పాత్ర ఇందులో ఏమిటి? అతను ఏమయ్యాడు? అనేది ఈ సినిమా కథ.
Dominic and the ladies purse OTT ✅#Dominic pic.twitter.com/HRdclkyUiG
— 𝙉𝙞𝙠𝙝𝙞𝙡 Ⓜ️Ⓜ️ (@nikhil__mm) December 11, 2025