Naxalites : ఆపరేషన్ ఖగార్ (Operation Khagar) పేరుతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) నక్సలిజం (Naxalism) నిర్మూలనకు పూనుకున్నప్పటి నుంచి ఎంతో మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లలో మరణించారు. అదేవిధంగా భారీ సంఖ్యలో నక్సల్స్ విడతల వారీగా లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బస్తర్ ప్రాంతంలో మరో 10 మంది నక్సైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.
ఈ విషయాన్ని బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ మీడియాకు వెల్లడించారు. బస్తర్ రీజియన్లో నక్సలిజాన్ని రూపుమాపి, అభివృద్ధికి బాటలు వేయడం కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం భద్రతా బలగాలు పలు ఆపరేషన్లు చేపడుతున్నాయని అన్నారు. ఫలితంగా పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని చెప్పారు.
ఇవాళ కూడా 10 మంది నక్సలైట్లు ఆయుధాలతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. శుక్రవారం లొంగిపోయిన 10 మంది నక్సలైట్లపై రూ.33 లక్షల రివార్డులు ఉన్నాయని చెప్పారు.
#WATCH | Sukma, Chhattisgarh | Bastar IG P. Sundarraj says, “…We are committed to eradicating naxalism and ensuring peace in the area to promote development in the region. Security forces are carrying out various operations in this regard. As a result, Naxalites are… pic.twitter.com/vJkurZLgl4
— ANI (@ANI) December 12, 2025