నార్నూర్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ (Trainee Collector) సలోని చాబ్రా (Saloni Chabra) అధికారులకు సూచించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రాన్ని ఆమె సందర్శించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ( Indiramma Houses ) పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో చేపట్టిన నాణ్యత గురించి హౌసింగ్ ఏఈ దుర్గం శ్రీకాంత్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతతో పాటు నిత్యం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు. ఆమె వెంట ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్, పంచాయతీ కార్యదర్శి మూతిరాం, టెక్నికల్ అసిస్టెంట్ జాదో సచిన్ తదితరులున్నారు.