MI vs PBKS : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కీలక పోరులో ముంబై ఇండియన్స్ (MI)ను ఢీకొడుతోంది. వరసగా నాలుగు ఓటములతో డీలా పడిన పంజాబ్ భారీ విజయంతో ముందంజ వేయాలనే కసితో ఉంది. అయితే.. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై పరువుకోసం పోరాడనుంది. ఇరుజట్లు గెలుపై కన్నేసిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై సారథి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కే మొగ్గు చూపాడు.
ఎనిమిది ఓటములతో లీగ్ దశలోనే ఇంటికి వెళ్తున్న ముంబైకి ఈ సీజన్లో మూడో కెప్టెన్‌గా బుమ్రా ఎంపికయ్యాడు. జట్టుతో కలిసి ధర్మశాలలో కనిపించిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లు ఊహించినట్టుగానే ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఆరంభంలో అదరగొట్టి.. ఆపై తడబడుతున్న పంజాబ్ గెలిస్తేనే ముందంజ వేసే అవకాశముంది. అయితే.. ధర్మశాలలో మొన్ననే ఢిల్లీ చేతిలో కంగుతిన్న అయ్యర్ సేన.. మూడు కీలక మార్పులతో ఆడుతోంది.
🚨Toss update from Dharamshala 🚨@mipaltan won the toss and elected to bowl first against @PunjabKingsIPL
Jasprit Bumrah leading #MI for the first time
Updates ▶️ https://t.co/idtc2OTLbP#TATAIPL | #KhelBindaas | #PBKSvMI pic.twitter.com/VHm0xIrYoK
— IndianPremierLeague (@IPL) May 14, 2026
ముంబై తుది జట్టు : రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధిర్, తిలక్ వర్మ, రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ బవ, కార్బిన్ బాస్చ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా(కెప్టెన్), రఘు శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ – రోహిత్ శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, క్రిష్ భగత్, బౌల్ట్.
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొన్నొల్లీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాన్ష్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, బార్ట్లెట్, అర్ష్‌దీప్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ – విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్, మిచెల్ ఓవెన్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే.