బూర్గంపహాడ్, మే 14 : వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపహాడ్ మండల కమిటీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బత్తుల వెంకటేశ్వర్లు, ఎస్కో. అబీదాను ఏకగ్రీవంగా ఎన్నుకోగా సహాయ కార్యదర్శిగా బయ్యా రాము, ఉపాధ్యక్షురాలిగా మరియమ్మతో పాటు మరో 10 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఈ పదవులతో కార్మిక సమస్యలపై తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నమ్మాయి, పద్మ, కనకదుర్గ, కుర్సా తిరుపతయ్య, మంగ, మీన, శివ పాల్గొన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపహాడ్ మండల నూతన కమిటీ