హనుమకొండ : విద్యా, వైద్యంలో జరుగుతున్న అవినీతిపై ఉక్కు పాదం మోపాలని అవినీతి దళారి నిర్మూలన సంస్థ వ్యవస్థాపకుడు పుల్లూరి కుమారస్వామి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. విద్య, వైద్యం రంగాలు నేడు కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తుంది. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ రెండు రంగాలు సామాన్య ప్రజలకు అందకుండా అందని ద్రాక్షల కార్పొరేట్ శక్తులకు బంగారు గుడ్లు పెట్టే బాతుల వ్యాపారమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో సైతం మానవతా విలువలను పక్కన పెడుతూ రోగుల పరిస్థితి ఎరగాచుపెడుతూ అవసరం లేని చికిత్సలు, స్కాన్లు ఖరీదైన మందులు ఐసియుల పేర్లు చెబుతూ కోట్ల రూపాయల దోచుకుంటున్నారని విమర్శించారు. కొన్ని ప్రైవేట్ దవాఖానల్లో అర్హతలలేని డాక్టర్స్ పనిచేయటం బాధాకరం అన్నారు. విద్యారంగానికి వస్తే ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లో హంగులు ఆర్భాటాలు చేస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆర్థికంగా నష్టపరుస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయకుండా ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో సరైన వారినే ఎన్నుకోవాలన్నారు. అలాగే అవినీతి నిర్మూల కోసం ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువస్తూ ప్రతి జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్వరంగల్ జిల్లా ఉమ్మడి అధ్యక్షులు సుద్దాల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా కన్వీనర్ గాదగోని శ్రీనివాస్, జీకే రవి, కే బాబురావు , అంబాల ఆనందం, కే.ప్రశాంతు పాల్గొన్నారు.