YCP MLC Botsa | చంద్రబాబు ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి : వైసీపీ ఎమ్మెల్సీ బొత్స
YCP MLC Botsa | వైసీపీ ఎమ్మెల్సీ, శాసన మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ ఏపీలో కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి : వైసీపీ ఎమ్మెల్సీ ( YCP MLC ),శాసన మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) ఏపీలో కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామలింగాపురంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సంక్షేమం వదిలేసి వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తుందని, చంద్రబాబు ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి పట్టిందని విమర్శించారు.
నిత్యవసర ధరలు ఆకాశాన్ని ఎగబాకినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. ఓటు వేసిన పాపానికి రోజుకి 10 సార్లు పవర్ కట్ అవుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబాలు దుర్భరంగా కాలం వెల్లదీస్తున్నారని వెల్లడించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత పరీక్షలు జరగకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని, ఏపీలో కూటమి పాలనకే ఆ చరిత్ర దక్కిందని విమర్శించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని మరోసారి స్పష్టం చేశారు. మెరిట్ లిస్టు జిల్లాల వారీగా ప్రకటించలేదని అసెంబ్లీలో చర్చకు పట్టుపడితే సమాధానం లేదని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

