‘ఓయ్ రైతూ.. నువ్వింకా సావలేదా?’
నిత్యం ప్రకృతితో పోరాడుతూ, వానకు నానుతూ- చలికి వణుకుతూ- ఎండకు ఎండుతూ సమాజానికి అన్నం పెట్టేది రైతు. అప్పుల్లో మునిగినా, వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకొని బతుకున్న కష్టజీవి. బాధను చెప్పుకొనేందుకు సర్కారీ అధికారి వద్దకు వెళ్లినప్పుడు కనీస మర్యాద లేకపోగా, ‘నువ్వింకా సావలేదా?’
నిత్యం ప్రకృతితో పోరాడుతూ, వానకు నానుతూ- చలికి వణుకుతూ- ఎండకు ఎండుతూ సమాజానికి అన్నం పెట్టేది రైతు. అప్పుల్లో మునిగినా, వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకొని బతుకున్న కష్టజీవి. బాధను చెప్పుకొనేందుకు సర్కారీ అధికారి వద్దకు వెళ్లినప్పుడు కనీస మర్యాద లేకపోగా, ‘నువ్వింకా సావలేదా?’ అంటే ఎంత ఆవేదన కలుగుతుంది. అటువంటి అధికారులు ఈ వ్యవస్థలో ఉండడం సిగ్గుచేటు. రైతు పట్ల అధికారి నోరుపారేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందాయి. సదరు అధికారి వైఖరి పట్ల యావత్తు ప్రజానీకం దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి, అతడిని సస్పెండ్ చేశారు. ఒక రైతు వేదనను పరిహసిస్తున్న తహసీల్దార్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది.
ఆ అధికారి ప్రవర్తన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. తాను, తన కుటుంబం తింటున్న అన్నపు మెతుకులన్నీ ఒక రైతు పొలంలో పండిన ధాన్యపు గింజలేనని సదరు అధికారి గుర్తుంచుకోవాలి. ప్రతీ మెతుకు అంతర్భాగంలో రైతు శ్రమ దాగి ఉన్నది. ఆ శ్రమ మాటల్లో వర్ణించలేనిది. ఒక రైతు పొలంలో దుక్కిదున్ని, నీరుపెట్టి, నారుపోసి, కలుపు తీసి, మందు లేసి, కోత కోసి, మోపు చేసి, బంతి కట్టి, వచ్చిన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తారు. ఆ ధాన్యపు గింజలే మన పల్లెల్లోని మెతుకులుగా మారుతాయి. రైతు ఆశీర్వాదంతోనే మన కడుపు నిండుతుంది. అన్నం పెట్టే రైతు పట్లనే పరిహాసం చేయడం అత్యంత హేయమైన ప్రవర్తన. రైతు ఆవేదన వింటే ఆ అధికారికి నవ్వు కూడా వస్తున్నదంటే ఎంతటి అమానవీయం. రైతు పట్ల అధికారి వికృత చేష్ట, జుగుప్సాకర ప్రవర్తనకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాదు; అధికారుల ప్రవర్తన ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. అధికారి అంటే అధికారం చెలాయించడం కాదు. ప్రజా సేవ చేయడం. ప్రజల పన్నులతో జీతం తీసుకొంటూ ప్రజలను హేళన చేయడం దుర్మార్గం.
అధికారులు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ప్రభుత్వమే అర్థమయ్యేలా చెప్పాలి. ‘జై జవాన్- జై కిసాన్, అన్నదాత, దేశానికి వెన్నెముక’ లాంటి నినాదాలు, బిరుదులు ఇస్తే సరిపోదు. బక్కచిక్కిన రైతును రాజు అంటూ కీర్తిస్తూనే మరోవైపు వాళ్ల రక్త మాంసాలను పిండుకొంటున్న ఈ సమాజాన్ని, ప్రభుత్వాలను చూసి ఈ నాటి చరిత్రపుటలు సిగ్గుతో తలవచుకుంటున్నాయి. రైతు బాధను నవ్వుతూ ఆస్వాదిస్తున్న అధికారులను క్షమించకూడదు. సస్పెన్షన్తోనే సరిపెట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యాంశమున్నది. ప్రతీ డిపార్ట్మెంట్లో ఎందరో మంచి అధికారులు కూడా ఉంటారు. మంచి అధికారులకు తగిన గౌరవం కల్పించాలి. నిరంతరం, ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తూ, పేద, పీడిత వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన ‘పీపుల్స్ ఐఏఎస్ ఆఫీసర్’ అని గుర్తింపు పొందిన ఎస్.ఆర్.శంకరన్ లాంటి మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకోకుండా ఉండలేం. అధికారులందరూ శంకరన్ వంటి అధికారులను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. అప్పుడే మహాత్మా గాంధీ కలలుగన్న నవసమాజ, సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. అటువంటి సమాజాన్ని సృష్టించేందుకు ప్రజలు, ప్రభుత్వాలు కృషి చేయాలి. రైతుని నువ్వింకా చావలేదా? అని ప్రశించిన అధికారి లాంటి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రైతు చనిపోతే ఏమవుతుందో తెలుసుకోవాలి. రైతు ఏడ్చిన నేలన రతనాలు రాళ్లగును, పంటలే మసిబారును, జాతియే నశియించును. గుండె పగిలిన రైతు లోకాన్ని వదిలితే- గుండెలోని జ్వాలలన్నీ… లోకాన్ని దహించును, ప్రళయాన్ని సృష్టించును!
బసవరాజు నరేందర్రావు 99085 16549
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

