కుంటి సాకులను ఆమోదించం.. కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో 2023 నాటి ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌ను కనుగొనలేకపోయామని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చేసిన వాదనపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
- 2023 నాటి శృంగేరి ఎన్నికల కౌంటింగ్ వీడియో గల్లంతు
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: అందుబాటులో ఉన్న రికార్డులను సమర్పించడంలో విఫలమైతే ఈసీఐకి వ్యతిరేకంగా ప్రతికూల నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. తన రికార్డులను పోగొట్టుకున్నామని ఈసీఐ ఎలా చెప్పగలదు? ఎన్నికలు నిర్వహించడమే మీ ప్రధాన విధి. అటువంటప్పుడు మీ వద్ద కచ్చితంగా ఒక పత్రం ఉండాలి కదా. మేము దానిని వెతికే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడానికి ఆస్కారం ఎక్కడుంది? మీరు ఆ పత్రాన్ని ఎన్నికైన అభ్యర్థికి ఇచ్చారు.
రికార్డుల భద్రత లేదా నిర్వహణ మీ వద్ద లేదా? మీ వద్ద ఉన్న దానిని తదుపరి విచారణ తేదీన సమర్పించండి. లేకపోతే మేము మీపై ప్రతికూల నిర్ణయానికి రావలసి ఉంటుంది. ఎలాంటి బలహీనమైన సాకులు మేము అంగీకరించము అని న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం ఈసీఐకి స్పష్టం చేసింది.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీఎన్ జీవరాజ్‌పై 201 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించినప్పటికీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల పునఃలెక్కింపు అనంతరం తన పదవిని కోల్పోయిన కాంగ్రెస్ నేత టీడీ రాజేగౌడ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతున్నది. 2023లో జరిగిన అసలు లెక్కింపు, ఈ ఏడాది మేలో నిర్వహించిన రీకౌంటింగ్, రెండింటికీ సంబంధించిన ఎన్నికల పరిశీలకుడి నివేదిక వీడియో రికార్డింగులను రాజేగౌడ కోరిన తర్వాత, ఫుటేజ్‌ను గుర్తించడంలో విఫలమైనందుకు ఈసీఐని ధర్మాసనం తప్పుపట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

