చౌటుప్పల్, నవంబర్ 19 : బీఆర్ఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ బుధవారం ఆందోళన చేపట్టారు. మండలపరిధిలోని దండు మల్కాపురం రెవెన్యూపరిధిలో న్యాయబద్ధంగా భూమి కొనుగోలు చేసి రిజిస్ట్ట్రేషన్ చేసుకుంటే రాజకీయ అక్కసుతోనే నిరంజన్ గౌడ్‌ను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
షాడో ఎమ్మెల్యే సంబంధిత అధికారులపై ఒత్తిడి తేవడంతోనే ఈ అరెస్ట్ జరిగినట్టు ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థిగా నిరంజన్ గౌడ్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఈ పనికి పూనుకున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.