ఎదులాపురం : కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును ( Waqf Amendment Bill ) వెంటనే ఉపసంహరించుకోవాలని ముఫ్తీ సర్దార్ రెహమాని ఖాస్మీ ( Rehaman Kasmi ) డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద భారీ మానవహారం చేపట్టి నిరసన తెలిపారు.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ సర్దార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాల రాస్తున్నదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా కేంద్రం వక్ఫ్ ఎమెండ్మెంట్ బిల్లును ఆమోదించిందని అన్నారు. వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు అఫ్సర్, సిరాజ్ ఖాద్రి, ఆరిఫ్, మహమ్మద్ రోహిత్, షానవాజ్, సలీం, తదితరులున్నారు .