Madhya Pradesh | భోపాల్, ఏప్రిల్ 3: తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఒక వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లా బిషన్ఖేడి గ్రామానికి చెందిన బజరంగి అనే వ్యక్తి తన ఒంటికి పలు దరఖాస్తు పత్రాలను దండలా తగిలించుకుని పాకుతూ డివిజనల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు.
తమ గ్రామంలో దుర్భరమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని, ఈ సమస్యపై గతంలో కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రికి కూడా విజ్ఞాపన పత్రాలు పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీంతో తమ సమస్యపై వినూత్నంగా నిరసన చేపట్టారు.