‘సవాళ్లను స్వీకరించడమంటే నాకిష్టం. కష్టతరమైనది సాధించినప్పుడు కలిగే ఆనందానికి విలువ కట్టలేం’ అంటున్నారు బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె మహేశ్బాబుకు జోడీగా రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రబృందం ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘తెలుగుభాషతో మీ ప్రయాణం ఎలా ఉంది?’ అని ప్రియాంకను ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యాత అడగ్గా.. ‘నాకు తెలుగు అస్సలు రాదు.
నిజానికి తెలుగు భాష నేర్చుకోవడం చాలా కష్టం. మామూలుగా మాట్లాడటం ఒకెత్తయితే.. కెమెరా ముందు డైలాగ్ చెప్పడం మరో ఎత్తు. అందుకే ఈ విషయంలో రాజమౌళి హెల్ప్ తీసుకుంటున్నా. ఆయన నాకు డైలాగ్ అర్థం చెబుతారు. పాత్ర ఇన్టెన్షన్ని వివరిస్తారు. దాన్ని బట్టి ఓ పదినిమిషాలు దానిపై వర్క్ చేసి, అప్పుడు నా ైస్టెల్లో నేను డైలాగ్ చెప్తున్నా. నిజానికి అది అంత ఈజీ కాదు. అందరి సహకారం వల్లే అది సాధ్యమవుతోంది.’ అంటూ సమాధానమిచ్చింది ప్రియాంక.