కులకచర్ల, జూన్ 17 : విద్యాభివృద్ధికి సహకరించడం అభినందనీయమని ముజాహిపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకరి సతీశ్ కుమార్ అన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వరలక్ష్మి విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్లు, షార్పనర్ లు ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.