డిబ్రూఘర్: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. ఇవాళ రెండు కార్యక్రమాల్లో ఆయన పాల్గోనున్నారు. అయితే డిబ్రూఘర్‌లో ఇవాళ ఉదయం ఓ టీ గార్డెన్‌కు ప్రధాని మోదీ వెళ్లారు. స్థానిక మహిళా కార్మికులతో కలిసి ఆయన తేయాకును తెంపారు. టీ గార్డెన్ వర్కర్లు ప్రధాని మోదీతో కలిసి సెల్ఫీ కూడా దిగారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీమాజి జిల్లాలోని గోగాముక్, బిశ్వనాథ్ జిల్లాలోనూ జరిగే మీటింగ్‌ల్లో ఆయన పాల్గొంటారు.
Assam: Prime Minister Narendra Modi visited a tea garden in Dibrugarh this morning and interacted with the women working here. pic.twitter.com/cUoPIWfzzk
— ANI (@ANI) April 1, 2026
మంగళవారమే బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్ చేసింది. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. 5 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ కూడా వేసిది. స్థానిక తెగల భూ హక్కులను కాపాడనున్నట్లు చెప్పింది. మళ్లీ అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. ఒకవేళ మళ్లీ ఎన్నికైతే 1950 నాటి ఇమ్మిగ్రాంట్స్ ఎక్స్పల్షన్ యాక్ట్‌ను అమలు చేయనున్నట్లు సీఎం బిశ్వశర్మ తెలిపారు. ఆ చట్టం ప్రకారం జిల్లా అధికారులు వలస కార్మికులను తరిమే అధికారం ఉంటుంది.