Super Girl | హాలీవుడ్ టాప్ స్టూడియోస్ డీసీ (DC) నుంచి వస్తున్న సరికొత్త చిత్రం ‘సూపర్‌గర్ల్’ (Supergirl). సూపర్ మ్యాన్ సోదరి అయిన ‘కారా జోర్-ఎల్’ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు క్రెయిగ్ గిల్లెస్పీ దర్శకత్వం వహిస్తుండగా.. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ఫేమ్ మిల్లీ ఆల్కాక్ ఈ చిత్రంలో సూపర్‌గర్ల్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుండగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. తన సొంత గ్రహం క్రిప్టాన్ నాశనమవడాన్ని కళ్లారా చూసిన కారా జోర్-ఎల్.. ఆ చేదు జ్ఞాపకాలతో బాధపడుతుంటుంది. అయితే తన ప్రియమైన క్రిప్టో (సూపర్ డాగ్)ను రక్షించుకోవడానికి ఆమె కాలంతో చేసే పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం. ఇక ఈ చిత్రంలో గెలాక్సీలోనే అత్యంత ప్రమాదకరమైన బౌంటీ హంటర్ ‘లోబో’ పాత్రలో హాలీవుడ్ స్టార్ జాసన్ మొమోవా కనిపించబోతుండటం విశేషం.