Shreyas Iyer: స్లో ఓవర్ రేట్.. శ్రేయాస్ అయ్యర్‌కు 12 లక్షల ఫైన్
Shreyas Iyer: పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు మూడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 కింద ఈ సీజన్ తొలి నేరంగా పరిగణిస్తూ .. స్లో ఓవర్ రేటు కింద అయ్యర్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ తన ప్రకటనలో తెలిపింది.
ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుచేసి విజయంతో టైటిల్ వేటను మొదలెట్టింది పంజాబ్ జట్టు. గిల్ సేన నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్.. 19.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి గెలుపు బోణీ కొట్టింది. ఈ లీగ్‌లో అరంగేట్ర మ్యాచ్ ఆడిన కూపర్ కనోలి (44 బంతుల్లో 72 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకానికి తోడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37, 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించారు. పంజాబ్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. బ్యాటర్ల వైఫల్యంతో 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ గిల్ (27 బంతుల్లో 39, 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్స్) మినహా మిగిలినవారంతా తేలిపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking water | గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

