వైరా, ఆగస్టు 03 : ప్రతి కుటుంబం తమ ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని వైరా 5వ వార్డు కౌన్సిలర్ కట్టా స్వరూప రాణి అన్నారు. సోమవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సాయి నిఖిత రోగులను పరీక్షించి, అవసరమైన సూచనలు, జాగ్రత్తలను వివరించి మందులను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ కట్టా స్వరూప రాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జ్వరం, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు చికిత్స పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లలిత కుమారి, అంగన్వాడి టీచర్ శ్రీదేవి, ఆశా వర్కర్ రేణుక, ప్రమీళ, మహేశ్వరి, ఆయా రేణుక పాల్గొన్నారు
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వైరా మున్సిపాలిటీ 5వ వార్డులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కట్టా స్వరూప రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి శిశువుకు తల్లిపాలే ఉత్తమ ఆహారమన్నారు. శిశువు పుట్టిన తొలి గంటలోపే ముర్రుపాలు ఇవ్వడం, తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించడం అత్యంత అవసరమని తెలిపారు. అనంతరం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పరిపూరక ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు.

‘పరిశుభ్రతతోనే అంటువ్యాధుల నివారణ’