18 ఏండ్లు దాటినవారికి ప్రికాషన్ డోసు
- రేపటి నుంచే అందుబాటులోకి
- ప్రైవేట్ టీకా కేంద్రాల్లోనే లభ్యం
- కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు రూ.600
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కొవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. 18 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న వారందరికీ ఈ నెల 10 నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇవి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తయినవారు ప్రికాషన్ డోసుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 15 ఏండ్లు పైబడినవారిలో 83 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ను పొందారని, దాదాపు 96 శాతం మంది కనీసం ఒక్క డోసునైనా తీసుకొన్నారని తెలిపారు. వీటితోపాటు ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏండ్ల వయసు దాటినవారు 2.4 కోట్లకుపైగా ప్రికాషన్ డోసులను పొందారని, 12 నుంచి 14 ఏండ్లలోపు వారిలో దాదాపు 45 శాతం మంది తొలి డోసు తీసుకొన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.
కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు@రూ.600
కొవిషీల్డ్ టీకా ప్రికాషన్ డోసు ధరను రూ.600గా నిర్ణయించినట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అధర్ పూనావాలా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీకా వేసుకొనే ఎవరైనా రూ.600(పన్నులు అదనం) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండిన అందరూ ప్రికాషన్ డోసు వేసుకోవడానికి కేంద్రం అనుమతించడాన్ని ఆయన స్వాగతించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

