హైదరాబాద్, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్(ఇందూరు) జిల్లాలో ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ముందు పలు కీలక ప్రతిపాదనలు ఉంచారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు బాలొండ నియోజకవర్గంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు లక్ష్యంగా సోమవారం సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ప్రశాంత్‌రెడ్డి.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్ ఆరోగ్య సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్ష ణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.
భీమ్‌గల్‌లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా దవాఖాన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ‘మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్‌లో కొత్త పీహెచ్సీ, బాలొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు నూతన భవనం, బాలొండమోర్తాడ్ మండలాల్లో పోస్టుమార్టం భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలి. నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 24గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని నియమించాలి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు ఆధునిక ఎంఆర్ఐ మి షన్ మంజూరుతోపాటు ఖాళీ పోస్టుల భర్తీ, అత్యవసర అవసరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి’ అని మంత్రి దామోదరకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను రిఫరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి రాజనర్సింహ తెలిపారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూ రాలజీతోపాటు ఇతర సూపర్ స్పె షాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం ఏర్పాటు, నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదనలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.