పట్నా, నవంబర్ 24: బీహార్‌లోని నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికలపై ఏ మాత్రమూ ప్రభావం చూపలేకపోయింది. రెండేండ్లుగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు, బీహార్‌వ్యాప్తంగా పాదయాత్ర, పెద్ద ఎత్తున మానవ వనరులు అందుబాటులో ఉన్నా.. ప్రశాంత్ కిషోర్ పార్టీ నాలుగు స్థానాల్లో ఓడిపోయింది. తరాని, రామ్‌గఢ్, బెలగంజ్, ఇమామ్ గంజ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో, ఏ ఒక్క చోటా జన్ సురాజ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. మూడు నియోజకవర్గాల్లో మూడో స్థానం, మరో చోట నాలుగో స్థానానికి ‘జన్ సురాజ్’ పరిమితమైంది.