మందమర్రి రూరల్ : వర్షాకాలం సీజన్ ఆరంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా సరైనా వర్షాలు( Rains ) లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురువాలని కోరుతూ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామ రైతులు (Ponnaram farmers) గురువారం కప్పతల్లి , ఊరు పోచమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పల్లకీ ఊరేగింపు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ ఊరికి మేలు జరగాలన్న నమ్మకంతో మొక్కులు చేశాం. అమ్మవారి కృపతో త్వరలోనే చల్లని వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నామనని పేర్కొన్నారు.