Crime controll | నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు పనిచేయాలి : అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్
Crime Controll | నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు.
కుభీర్ : నేరాల నియంత్రణే (Crime controll ) లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ (Additional SP Avinash Kumar ) అన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubeer ) పోలీస్ స్టేషన్‌ను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన పరిసరాలను పరిశీలించి, పోలీసులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు.
అంతకుముందు స్టేషన్ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్సై కృష్ణారెడ్డికి సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మోసపూరిత ఆన్లైన్ కార్యకలాపాలను అరికట్టడం, తక్షణ చర్యల ద్వారా బాధితులకు న్యాయం చేయడం వంటి అంశాల్లో ముందుండాలని పేర్కొన్నారు.
సైబర్ క్రైం దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అత్యంత కీలకమన్నారు. భవిష్యత్తులో మరింత నైపుణ్యంతో కేసులు పరిష్క రించేలా సైబర్ వారియర్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో నియమించిన సైబర్ వారియర్స్ తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలన్నారు.
సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపో యిన వ్యక్తులు డబ్బు బ్యాంకులో ఫ్రిజ్ అయి ఉన్నట్లయితే వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అనుకోని రీతిలో ఎవరైనా సైబర్ నేరానికి గురైతే కంగారు పడకుండా వెంటనే 1930 ఫోన్ నంబర్‌కు, ఎన్సీఆర్పీ పొర్టల్ను గానీ, దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో గాని సంప్రదించాలని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

