హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో నిందితుడైన బండి సాయిభగీరథ్‌కు బెయిల్ ఇవ్వవద్దని, బె యిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఈ మేరకు పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కే విజయవర్ధన్ హైకోర్టులో శుక్రవారం కౌంటరు దాఖలు చేశారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, తరువాత మే 9న బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో అభియోగాలను సవరిస్తూ మెమో దాఖలు చేశామని వివరించారు.
సూల్ రికార్డుల ప్రకారం బాలిక వయ స్సు 17 సంవత్సరాలు మాత్రమేనని, ఆ మె మైనర్ కాబట్టి ఎఫ్ఐఆర్లోని సెక్షన్లను సవరించాల్సి వచ్చిందని తెలిపారు. బాలిక వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం చేసుకొని ఆమెను లొంగదీసుకున్నాడని పేర్కొన్నారు. 2025 నుంచి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దశలో బెయి లు మంజూరు చేస్తే న్యాయప్రక్రియకు భంగం కలిగించే అవకాశం ఉన్నదని, అందువల్ల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. బెయిలు పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 6కు వాయిదా వేసింది.