బండి భగీరథ్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. సాక్షులను ప్రభావితం చేస్తారు
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయిభగీరథ్‌కు బెయిల్ ఇవ్వవద్దని, బె యిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే ప్రమాదం ఉన్నదని చెప్పారు.
- బెయిల్‌పై పోలీసుల అభ్యంతరం
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో నిందితుడైన బండి సాయిభగీరథ్‌కు బెయిల్ ఇవ్వవద్దని, బె యిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఈ మేరకు పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కే విజయవర్ధన్ హైకోర్టులో శుక్రవారం కౌంటరు దాఖలు చేశారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, తరువాత మే 9న బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో అభియోగాలను సవరిస్తూ మెమో దాఖలు చేశామని వివరించారు.
సూల్ రికార్డుల ప్రకారం బాలిక వయ స్సు 17 సంవత్సరాలు మాత్రమేనని, ఆ మె మైనర్ కాబట్టి ఎఫ్ఐఆర్లోని సెక్షన్లను సవరించాల్సి వచ్చిందని తెలిపారు. బాలిక వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం చేసుకొని ఆమెను లొంగదీసుకున్నాడని పేర్కొన్నారు. 2025 నుంచి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దశలో బెయి లు మంజూరు చేస్తే న్యాయప్రక్రియకు భంగం కలిగించే అవకాశం ఉన్నదని, అందువల్ల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. బెయిలు పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 6కు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

