లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్కు షాక్ తగిలింది. అతను మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టగా.. టాప్ సీడ్ యానిక్ సినర్ (ఇటలీ), సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో 8వ సీడ్ మెద్వెదెవ్ 6-7 (4/7), 6-7 (5/7), 5-7తో అన్‌సీడెడ్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. వరల్డ్ నంబర్ వన్ సినర్ 6-4, 6-3, 6-4తో వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ బ్రూస్కీని చిత్తు చేయగా.. ఏడో సీడ్ నొవాక్ 7-5, 6-4, 1-6, 7-6 (7/4)తో 25వ సీడ్ రిండర్క్నెచ్ (ఫ్రాన్స్)పై గెలిచేందుకు కాస్త కష్టపడ్డాడు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) నాలుగో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా), జపాన్ స్టార్ నవోమి ఒసాకా ముందంజ వేశారు. మూడో రౌండ్లో సబలెంకా 6-4, 6-4తో ఓస్తపెంకో (లాత్వియా)ను, పెగులా 6-1, 6-3తో బౌజాస్ (స్పెయిన్) ను వరుస సెట్లలో చిత్తు చేయగా.. 14వ సీడ్ ఒసాకా 6-1, 6-3తో కసట్కినా (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచింది. మరో మ్యాచ్‌లో 11వ సీడ్ బెలిందా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6-4, 4-6, 7-6 (10/6) కలిన్స్కయా (రష్యా)పై చెమటోడ్చి నెగ్గింది.