సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఏఎస్ఐ ఆత్మహత్య

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ ఉదయం ఘోరం జరిగింది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన పోలీస్ అధికారి ఢిల్లీ పోలీస్ విభాగానికే చెందిన ఏఎస్ఐ తేజ్‌పాల్ (55)గా అధికారులు గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని జఖీరా ఫ్లైవోవర్ దగ్గర విధి నిర్వహణలో ఉన్న ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చెందిన వ్యాన్‌లో కూర్చుని, తన సర్వీస్ రివాల్వర్‌తో ఛాతిలో కాల్చుకున్నాడు. వెంటనే సహచర పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కాగా, మృతుడు తేజ్‌పాల్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన వాడుగా పోలీస్ అధికారులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని వారు చెప్పారు. తేజ్‌పాల్ ఆత్మహత్యకు పాల్పడిన వ్యాన్‌ను దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలు సేకరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

