సిటీబ్యూరో, డిసెంబర్ 27: సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ర్యాష్ డ్రైవింగ్‌పై నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్ గాయపడి 45 రోజుల పాటు క్రిటిక్ కేర్ యూనిట్లో చికిత్స పొంది ఇటీవల బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో అతనికి 91 సీఆర్పీసీ కింద నోటీసును జారీ చేశామని సీపీ తెలిపారు. ఈ నోటీసు కింద సాయిధరమ్ తేజ్ తన వాహనానికి సంబంధించిన పత్రాలు, అతని డ్రైవింగ్ లైసెన్స్‌లను తీసుకుని హాజరుకావాలని కోరామని సీపీ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.