Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Police Raids | మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలపై తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి నాలుగు టిప్పర్లను పట్టుకున్నారు.
మాగనూరు : మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ( Sand Transportation ) వాహనాలపై తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడులు ( Police Raids ) నిర్వహించి నాలుగు టిప్పర్లను పట్టుకున్నారు. ఎస్సై కే మహేందర్ రెడ్డి ( SI Mahendar Reddy ) ఆదేశాల మేరకు పోలీసులు వడ్యాట్ గ్రామ శివారులో రెండు టిప్పర్లు, వడ్యాట్ నుంచి చందాపూర్ వెళ్లే మార్గంలో మరో రెండు టిప్పర్లను పోలీసులు గుర్తించారు. వాహనాల్లో ఇసుక తరలిస్తున్న ప్పటికీ అందుకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో నాలుగు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై సంబంధిత వాహనదారులపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మండలంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మండలంలో అక్రమ ఇసుక దందాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడేలా నిరంతర నిఘా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

