Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
Sangam Banda canal | కొన్ని నెలలుగా కాలువకు గండి పడటంతో విలువైన సాగునీరు వృథాగా పారిపోతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Sangam Banda canal | మాగనూరు, నవంబర్ 09 : సంగం బండా రిజర్వాయర్ నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాల కోసం ఆదా చేయాలని ప్రభుత్వాలు ఒకవైపు చెబుతుంటే.. మరోవైపు సంఘం బండా రిజర్వాయర్ రైట్ లో లెవెల్ కెనాల్ కాలువకు పడిన గండిని పూడ్చడంలో ఇరిగేషన్ శాఖ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం రైతులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కొన్ని నెలలుగా కాలువకు గండి పడటంతో విలువైన సాగునీరు వృథాగా పారిపోతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నీరు వృథా అవుతున్నా పట్టని అధికారులు!
రిజర్వాయర్ నుంచి విడుదలవుతున్న సాగునీరు కాలువ గండి ద్వారా పక్కదారి పడుతూ వృథాగా ప్రవహిస్తోంది. కాలువ గండి కారణంగా నీరు అవసరం లేని ప్రాంతాల్లోకి కూడా చేరుతుండగా, సాగుకు అవసరమైన సమయంలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తే సమస్య తీవ్రత స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం మరమ్మతులు చేపట్టడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
వార్తలు వచ్చినా స్పందన శూన్యం..!
కాలువ గండి సమస్యపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారుల్లో ఎలాంటి స్పందన కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చినప్పుడు స్పందించి పరిష్కరించాల్సిన అధికారులు వార్తలను సైతం పట్టించుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కాలయాపన చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడుతున్నారు.
జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ ఏది..?
క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన జిల్లా స్థాయి ఇరిగేషన్ అధికారులు స్థానిక అధికారుల సమాచారానికే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నీరు ఏ విధంగా వృథా అవుతోంది..? కాలువ గండి ఎంత మేరకు ఉంది,,..? మరమ్మతులకు ఎంత ఖర్చవుతుంది.. ? అనే అంశాలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం అధికారుల పర్యవేక్షణపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారా?
నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సాగునీరు, తాగునీటిని వృథా చేయకుండా చూడాలని ప్రభుత్వం పదేపదే సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలకు, ఇరిగేషన్ శాఖ అధికారుల పనితీరుకు పొంతన లేకుండా పోతోందని రైతులు విమర్శిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన సాగునీటి వ్యవస్థను కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా స్పందించాలి.. రైతుల డిమాండ్!
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సంఘం బండా రిజర్వాయర్ కాలువ గండి ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని, వెంటనే మరమ్మతులు చేపట్టి వృథాగా పారుతున్న సాగునీటిని అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై నిర్లక్ష్యం వహించిన అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించి బాధ్యత నిర్ణయించాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు నీటిని ఆదా చేయాలని పిలుపునిస్తుంటే.. అధికారులు మాత్రం కళ్లముందే నీరు వృథా అవుతున్నా మౌనంగా ఉండటం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం నీటి సంరక్షణ గురించి చెప్పడమేనా..? క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులకు లేదా..? సంగం బండా రిజర్వాయర్ కాలువ గండికి మరమ్మతులు ఎప్పుడు చేపడతారో వేచి చూడాల్సిందే..!

Read Also :
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

