రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
ఎల్ నినో ప్రభావం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని హాలియా ఏడీఏ సరిత అన్నారు. సోమవారం గుర్రంపోడ్ మండలంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. రానున్న వ్యవసాయ సీజన్లో ఎల్‌నినో ప్రభావం...
గుర్రంపోడ్, నవంబర్ 09 : ఎల్ నినో ప్రభావం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని హాలియా ఏడీఏ సరిత అన్నారు. సోమవారం గుర్రంపోడ్ మండలంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. రానున్న వ్యవసాయ సీజన్లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి లభ్యతపై ఏర్పడే ప్రభావాల గురించి రైతులకు వివరించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్ర వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. పంటల ఎంపికలో స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం మరియు నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.
అలాగే వరి పంట కోత అనంతరం పంట అవశేషాలను (వరి గడ్డిని) పొలాల్లో తగులబెట్టవద్దని రైతులకు సూచించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని వివరించారు. వరి గడ్డిని తగులబెట్టకుండా పొలంలోనే కలియదున్నడం లేదా ఇతర సేంద్రీయ పద్ధతుల్లో వినియోగించుకోవాలని సూచించారు. నీటి పొదుపు పద్ధతులు పాటిస్తూ, అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకొని ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించే విధంగా రైతులు వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఏడీఏ రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రామాంజనేయులు, గౌతమి, భాగీరథ, హఫీదా, జ్యోత్స్న, ధరణి, నేతాజీ, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

