చౌటుప్పల్‌లో డ్రగ్స్ కలకలం
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.లక్షా 6వేల విలువైన డ్రగ్స్, రెండు కార్లు, రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు
గోవా నుంచి తరలిస్తున్న మహిళ నుంచి స్వాధీనం
కొనుగోలు చేసిన ఇద్దరు యువకుల అరెస్ట్
చౌటుప్పల్, జూన్ 9 : గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.లక్షా 6వేల విలువైన డ్రగ్స్, రెండు కార్లు, రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్‌లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. మణిపూర్ రాష్ట్రం చందల్ జిల్లాకు చెందిన డయానా లెచాంగో చారవ్ తన భర్త ఉచే జస్టస్తో కలిసి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుంది.
ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేతన్, ఆదిత్యకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వారిని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌హెచ్-9 హోటల్ సమీపానికి రావాలని డయానా సూచించింది. దీంతో వారు గ్రడ్స్ తీసుకునేందుకు గురువారం ఉదయం ఎన్‌హెచ్-9 హోటల్ సమీపానికి రాగా.. డయానా అప్పటికే వారి కోసం అక్కడ ఎదురుచూస్తుంది. పక్కా సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వారిని వల పన్ని పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీసీపీ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీపీ నూకల ఉదయ్‌రెడ్డి, సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ అనిల్ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- bust
- Choutuppal
- drug
- peddlers
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

