రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలి : నందిని సిధారెడ్డి
రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. పాలకుల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలని...
– పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న పాలకులు
– నల్లగొండలో రైతు జనకవనం కవి, గాయక సమ్మేళనం
నల్లగొండ, నవంబర్ 11 : రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. పాలకుల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలని, రైతు సంక్షేమమే ధ్యేయంగా రచనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలు నల్లగొండలో జరుగుతున్న సందర్భంగా దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి సంఘీభావంగా బుధవారం టీఎన్జీఓ భవన్లో తెలంగాణ సాహితీ, ప్రజా నాట్య మండలి, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు జనకవనం కవి, గాయక సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నందిని సిధారెడ్డి మాట్లాడారు.
రైతు కన్నీటితో రాజ్యం బాగుపడదు
ఎద్దు ఏడ్చిన వ్యవసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ప్రభుత్వాలు రైతాంగానికి ద్రోహం చేశాయని విమర్శించారు. తెలంగాణలో భూమి కోసం సాయుధ పోరాటం జరిగిందని, నాటి భూస్వాముల స్థానంలో నేడు పెట్టుబడిదారులు వచ్చి భూములను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. భూమిని అమ్ముకొని అన్నం తినాల్సిన దుస్థితి నేటి రైతులకు ఏర్పడిందన్నారు. రైతులను భూమికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే సామర్థ్యం కూడా ప్రభుత్వాలకు లేకపోవడం వల్ల పేద రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగాన్ని పట్టించుకోకుండా, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. కవులు అట్టడుగు వర్గాల పక్షాన నిలిచి, రైతుల సమస్యలను ప్రతిబింబించే రచనలు చేయాలని పిలుపునిచ్చారు.

రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలి : నందిని సిధారెడ్డి
భూ సంస్కరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : డాక్టర్ ఎన్.ఏనుగు నరసింహారెడ్డి
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పలు పథకాలను చేపట్టాలని, భూ కేంద్రీకరణ జరగకుండా భూ సంస్కరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే అందరికీ భూమి లభించే అవకాశం ఉంటుందని ప్రముఖ కవి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. కవులకు, రైతులకు మధ్య ఉన్న సంబంధం, రైతులకు భూమికి ఉన్న సంబంధం ఒకటేనని పేర్కొన్నారు. పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిన నల్లగొండలో అఖిలభారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలు నిర్వహించడం ప్రత్యేకతతో కూడుకున్నదని, అభినందనీయమని తెలిపారు. కవులు అట్టడుగు వర్గాల పక్షాన నిలబడి రచనలు చేసినప్పుడే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పాలకులు గుర్తించి పరిష్కరించినప్పుడే వారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయించుకునేందుకు రైతులు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు సాగించిన ఉద్యమం చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిందని నరసింహారెడ్డి పేర్కొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, మునాసు వెంకట్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ పగడాల నాగేందర్, వురిమల్ల సునంద, కాక మంజన్న, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కట్ట నరసింహ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల ఆనంద్, ప్రముఖ బాల సాహిత్యవేత్త పుప్పాల కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సలీమ, తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సభ్యులు శరత్ సుదర్శి, కే.రమేష్, శ్రీలత దావన్, సుధా కొలచనా, కొండా రవీందర్, అజయ్, జిట్టా భాస్కర్ రెడ్డి, దుర్గాచారి, ఏభూసి నర్సింహ పాలడుగు నాగార్జున, తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హాసేనా, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శ్రీరాములు, బూర్గు గోపికృష్ణ, తరుణోజు భీష్మాచార్య, బరిగెల శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలి : నందిని సిధారెడ్డి
Girl falls into water tank, 4 Dies | నీటి ట్యాంకులో పడిన బాలిక.. రక్షించే క్రమంలో ఆమెతో సహా నలుగురు మృతి
‘పూర్తిస్థాయి బోనస్ చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదు’
Dasoju Shravankumar | రూ.1000 కోట్ల బీసీ భూములను కాంగ్రెస్ సర్కార్ దోచిపెట్టింది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి : డీఈవో శంభుప్రసాద్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

