Dasoju Shravankumar | రూ.1000 కోట్ల బీసీ భూములను కాంగ్రెస్ సర్కార్ దోచిపెట్టింది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Dasoju Shravankumar | ప్రభుత్వ భూమికి యజమాని ప్రభుత్వం కాదు.. ప్రభుత్వం తోటమాలి లెక్క కేవలం కస్టోడియన్ మాత్రమే.. అమ్మేందుకు హక్కుండదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.
Dasoju Shravankumar | తెలంగాణను దోపిడీకి ప్రయోగశాలగా మార్చేసి విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఈ ప్రభుత్వ పెద్దలు భూ కబ్జాకోరులుగా మారిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ భూములను తెగనమ్ముతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమికి యజమాని ప్రభుత్వం కాదు.. ప్రభుత్వం తోటమాలి లెక్క కేవలం కస్టోడియన్ మాత్రమే.. అమ్మేందుకు హక్కుండదు.. ఒకవేళ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడితే కూడా దీర్ఘ కాలిక ఇన్ఫ్రా స్ట్రక్చర్ తయారు చేసేందుకో.. ప్రజల అవసరాలకు ఆదుకోవడం కోసమో ప్రభుత్వ భూమిని వినియోగించాలి తప్ప ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టుకుని సొమ్ము చేసుకుని తద్వారా కమీషన్లు దండుకునే వెసులుబాటు రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇవ్వలేదన్నారు.
గాదె కింద పందికొక్కుల కంటే హీనంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని దాసోజు ఫైర్ అయ్యారు.. ఇంతకంటే నీచత్వం రాజ్యాంగ విద్రోహం, ప్రజా ద్రోహం ఇంకోటి లేదన్నారు. దళిత భూముల కథ అయిపోయింది.. . అక్కడ దళితులకు చెందిన 6 ఎకరాల భూమిని ‘ఏక్తా మాల్’ పేరిట ప్రైవేట్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం దోచిపెట్టిందని వివరించారు. ఇవాళ బీసీ భూముల మీద పడ్డది. బహుజన బిడ్డలకు సంబంధించిన రూ. 1,000 కోట్ల విలువైన 3.17 ఎకరాల భూమిని.. శేరిలింగంపల్లి ఖాజాగూడ గ్రామంలో ఉన్న అత్యంత ఖరీదైన భూమిని ‘SAS Infraసకు దోచిపెట్టారు.
మరి వీళ్లు ఎవరికి చుట్టమో.. ఏ లోపాయికారి ఒప్పందాలు ప్రభుత్వ పెద్దలతో ఉన్నయో .. ఇవన్నీ విచారణలో బహిర్గతం కావాల్సిన అవసరముందన్నారు వీళ్లేమైనా తెలంగాణ ప్రజలకు అల్లుల్లా.. తెలంగాణ బీసీ బిడ్డలకు చెందాల్సిన ఒక హక్కును, ఆస్తులను మీ ఈ రకంగా ఎట్లా కట్టబెడుతుండో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకుంటోంది.
బీసీ స్టడీ సర్కిల్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
– ఎమ్మెల్సీ @sravandasoju https://t.co/x8LVCKymDE
— BRS Party (@BRSparty) November 11, 2026
Read Also :
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravankumar | రూ.1000 కోట్ల బీసీ భూములను కాంగ్రెస్ సర్కార్ దోచిపెట్టింది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి : డీఈవో శంభుప్రసాద్
వజ్రమ్మ ఘన విజయం చేనేత రంగానికి గర్వకారణం : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
TN CM Vijay | తమిళనాడు ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంపై విమర్శలు.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం విజయ్
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 12 మంది ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

