పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి : డీఈవో శంభుప్రసాద్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.శంభుప్రసాద్ అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించి...
బూర్గంపహాడ్, నవంబర్ 11 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.శంభుప్రసాద్ అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించి అనంతరం ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పూర్తిస్థాయిలో పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలల నిర్వహణలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలన్నారు. అనంతరం డీఈవోను ఎంఈవో, ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో ఎంఈవో యదుసింహరాజు, హెచ్ఎం రవీలాదేవి, ఉపాధ్యాయులు శంకర్, లలిత, భాస్కర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి : డీఈవో శంభుప్రసాద్
వజ్రమ్మ ఘన విజయం చేనేత రంగానికి గర్వకారణం : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
TN CM Vijay | తమిళనాడు ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంపై విమర్శలు.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం విజయ్
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 12 మంది ఎంపిక
‘విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు చెకుముకి సైన్స్ సంబురాల నిర్వహణ’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

