సెంట్రల్ విస్టా ప్రాజెక్టు విమర్శకులపై మోదీ ఫైర్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ ఆఫీసులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టును విమర్శిస్తున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కేవలం పర్సనల్ ఎజెండా కోసమే జాగ్రత్తపడుతున్నాయని ఆరోపించారు. కీలక ప్రభుత్వ ఆఫీసులు, మంత్రిత్వ కార్యాలయాలు ఎలా ఉన్నాయో ప్రతిపక్షాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. సుమారు 20 వేల కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. సెంట్రల్ విస్టా కింద కొత్త పార్లమెంట్ భవనంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను నిర్మించనున్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు ఎలా ప్రవర్తించారో తెలుసు అని, స్వలాభం కోసం తప్పుడు సమాచారాన్ని చేరవేశారని, కానీ వాళ్లు ఎప్పుడూ ప్రభుత్వ కార్యాలయాల దీనస్థితి గురించి మాట్లాడలేదని, మంత్రులు పనిచేసే ఆఫీసులు ఎలా ఉన్నాయో పట్టించుకోలేదని, రక్షణశాఖ కాంప్లెక్స్ గురించి వాళ్లు ఎన్నడూ పెదవి విప్పలేదని ప్రధాని మోదీ విమర్శించారు. రక్షణశాఖ ఆఫీసు గురించి ప్రతిపక్షాలు మాట్లాడి ఉంటే, వాళ్లు చెప్పే అబద్దాలు బయటపడేవని మోదీ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తప్పుపట్టిన విషయం తెలిసిందే. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని నిర్ణీత సమయం లోపే పూర్తి చేస్తామని ప్రధాని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

