నేడు కేంద్ర కేబినెట్ భేటీ
నేడు కేంద్ర కేబినెట్ భేటీ | కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశం కానుంది.

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా దేశంలోని పరిస్థితులతో మంత్రులతో ప్రధాని చర్చించనున్నారు. ప్రధానంగా రోడ్డు రవాణా, పౌర విమానాయశాఖ, టెలీకాం మంత్రిత్వశాఖలు చేపట్టిన పనులపై సమీక్షించనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల మోదీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో కేంద్రమంత్రివర్గ మార్పులు, చేర్పులుంటాయని ఊహాగానాలున్నాయి.
ఈ క్రమంలో కేబినెట్ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి శివసేన, శిరోమణి అకాలీదళ్ వైదొలగడంతో రెండు కేంద్ర మంత్రి పదవులు, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్, మరో కేంద్రమంత్రి సురేష్ అంగడి మృతితో మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా అయ్యాయి. ఆయాశాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. అదనపు భారంతో మంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేబినెట్ పునర్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ గాంధీ, జ్యోతిరాధిత్య సింధియాతో పాటు మరో ఇద్దరిని కేబినెట్లోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
వృక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
భారత్ బయోటెక్ చైర్మన్‌కు ‘వై’ కేటగిరి భద్రత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

