Cherlapally Terminal | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో రూ.413 కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించనున్నారు. టెర్మినల్‌ను భారత ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్సు(వర్చువల్)ద్వారా ప్రారంభించనున్నట్టు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినివైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ హాజరుకానున్నారు.
చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ 2023 డిసెంబర్లో ప్రారంభం కావాల్సి ఉంది. అందుకు ప్రణాళికలు కూడా రూపొందించుకున్నారు. కాని అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు అలసత్వాన్ని ప్రదర్శించారని, దీంతో టెర్మినల్ ప్రారంభం ఆలస్యమైనట్టు కొందరు రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.