Chevella Accident | రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) సంభవించిన విషయం తెలిసిందే. చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్గ్రేషియా (ex gratia) ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని ఎక్స్ ట్వీట్లో పేర్కొన్నారు.
PM Modi announces an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 for the injured in the road accident in Rangareddy district of Telangana.
PMO tweets, “The loss of lives due to a mishap in the Rangareddy district of Telangana is deeply… pic.twitter.com/HNfxlxesQ3
— ANI (@ANI) November 3, 2025
Also Read..
Kale Yadaiah | చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకున్న స్థానికులు
Chevella | చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి.. వీడియో