Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద (Chevella Accident) ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద (Chevella Accident) ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 21 మంది దుర్మరణం చెందడంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

