Britain PM | అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌పై గెలుపొందారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం స్కాట్లాండ్లో క్వీన్ ఎలిజిబెత్‌కు తన రాజీనామా లేఖను అందించనున్నారు. గత జూలైలోనే బోరిస్ జాన్సన్ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎన్నికలు జరిగాయి. మరో వైపు కొత్తగా ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ ఇవాల ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకోసం లిజ్ ట్రస్‌తో క్వీన్ ఎలిజిబెత్ ప్రమాణం చేయించనున్నారు. అనంతరం లండన్ చేరుకొని డౌనింగ్ స్ట్రీట్ నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం మంత్రివర్గాన్ని ప్రకటిస్తారు. గురువారం ఆమె ప్రధాని హోదాలో హౌస్ ఆఫ్ కామర్స్‌కు వెళ్లనున్నారు.