జూన్‌లో ఎగరనున్న ఆకాశ విమానాలు
- ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే వెల్లడి
హైదరాబాద్, మార్చి 25: ప్రముఖ ఇన్వెస్టర్ ఝున్‌ఝున్‌వాలాకి చెందిన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ విమానాలు జూన్‌లో ఎగురబోతున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో వినయ్ దూబే వెల్లడించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడుతూ..మే చివరి వారంలో లేదా జూన్ తొలి వారంలో విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని, తొలి విడుదల రెండు విమానాలతో సేవలు అందించనున్నట్లు చెప్పారు. తొలి ఏడాదికాలంలో 18 విమానాలు, ఐదేండ్లలో ఈ సంఖ్యను 72కి పెంచుకోవాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విమాన సేవలకు అవసరమైన లైసెన్స్లకోసం ప్రయత్నిస్తున్నట్లు అన్నారు. తొలుత ఏయే నగరాలకు అందిస్తారనే విషయంపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కానీ, భారత్‌లో మాత్రమే విమాన సేవలు అందిస్తామని చెప్పారు.
భారత్‌కు 2 వేల విమానాలు: బోయింగ్
వచ్చే 20 ఏండ్లలో భారత్‌కు 2 వేల సింగిల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అవసరమవుతాయని బోయింగ్ అంచనావేస్తున్నది. దక్షిణాసియా విమాన విభాగంలో భారత్ ఆధిపత్యం వహించనున్నదని అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ వెల్లడించింది. ఈ విమానాల విలువ 375 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత్ ఎయిర్ కార్గో సేవలు ప్రతియేటా 6 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, కేంద్రం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియాతో ఈ రంగం రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే లక్ష మంది నూతన పైలెట్లు అవసరమని వ్యాఖ్యానించింది.
ఎయిర్‌లిఫ్ట్ గ్లోబల్‌తో ఎయిర్‌బస్
దేశవ్యాప్తంగా చాపర్ అంబులెన్స్ సేవలు అందించడానికి ఎయిర్‌లిఫ్ట్ గ్లోబల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య శుక్రవారం అంగీకార ఒప్పందం జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Air flights
- Aircraft
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

