న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను వెంటనే అక్కడ నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టులో మరో పిల్ దాఖలైంది. కరోనా అంతం అయ్యే వరకు దేశంలో ఎక్కడా నిరసన ప్రదర్శనలు నిర్వహించవద్దని, అందుకు కేంద్రం అన్ని రాష్ర్టాలకు మార్గదర్శకాలు జారీచేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు స్వాతి, సంజీవ్ నెవాడ్ కోరారు.