బీజింగ్: కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తికి చరిత్రలో తొలిసారిగా పంది కాలేయాన్ని అమర్చారు. జన్యు మార్పిడి చేసిన పంది కాలేయాన్ని బాధితుడికి అమర్చినట్టు చైనా వైద్యులు ప్రకటించారు. జంతువుల అవయవాలను మానవులకు మార్పిడిచేసే జెనోట్రాన్స్ప్లాంటేషన్లో ఇది ఒక మలుపుగా పరిగణిస్తున్నారు.