తాండూర్ : హైదరాబాద్లో మూడురోజుల పాటు జరుగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో (Photo Trade Expo ) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు కోరారు. శుక్రవారం తాండూర్ ( Tandur ) ఐబీలో కార్యక్రమానికి చెందిన పోస్టర్ను విడుదల చేశారు.
తాండూర్ మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడిపల్లి చంద్రశేఖర్ ( Chandra Shekar) మాట్లాడుతూ ఈనెల 19, 20, 21 తేదీలలో హైదరాబాదులోని ఓం కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో జరుగుతుందని అన్నారు.
మండలంలోని ఫోటో, వీడియోగ్రాఫర్లు హాజరై ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతోపాటు నూతన ఫోటో, వీడియో కెమెరాల గురించిన విషయాలు, నూతన ఏఐ టెక్నాలజీకి సంబంధించిన విషయాలునేర్చుకొని వృతిల్లో రాణించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అప్పును రామన్న, ప్రధాన కార్యదర్శి పోతనవేణి తిరుపతి, కోశాధికారి ముక్కెర శ్రీనివాస్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు ఆకుల వేణు, తాండూర్ మండల గౌరవ అధ్యక్షుడు సబ్బని శ్రీనివాస్, సబ్బని సమ్మన్న, తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి శోభన్, కోశాధికారి రామటింకి రమేష్, మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, సురేష్, మోయిన్, వెంకటేష్, షారుక్, సుధాకర్, రంజిత్ దుర్గాప్రసాద్ బాలు, గిరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.