WhatsApp | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 : 24 దేశాలకు చెందిన సుమారు 90 మంది ఫోన్లను స్పైవేర్ ద్వారా హ్యాకర్లు హ్యాక్ చేశారని వాట్సాప్ వెల్లడించింది. బాధితుల్లో పాత్రికేయులు, పౌర సమాజ సభ్యులు ఉన్నారని, ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్‌కు చెందిన హ్యాకింగ్ టూల్ దీనికి పాల్పడిందని తెలిపింది. బాధితుల్లో యూరప్‌వాసులు ఎక్కువగా ఉన్నారు. పారగాన్ స్పైవేర్ జీరో-క్లిక్ విధానంలో పనిచేస్తుందని హ్యాకింగ్ నిపుణులు వెల్లడించారు. యూజర్లు ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయకపోయినా వారి ఫోన్లు హ్యాక్ అవుతాయి.