
హైదరాబాద్, నవంబర్ 13: పీట్రాన్ పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తున్న పాల్రెడ్ టెక్నాలజీ లిమిటెడ్ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆదాయం రూ.74.72 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత పండుగ సీజన్లో నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడం సంస్థ ఆదాయం పెరుగడానికి దోహదం చేసింది.