హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ స్నేహితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు భగీరథ్ స్నేహితులపై దృష్టి పెట్టారు.
బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన సమయంలో అక్కడే ఉన్న భగీరథ్ స్నేహితులు, ఘటన అనంతరం రాజీ కోసం ప్రయత్నించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక యువతి సహా నలుగురిని విచారించిన పోలీసులు మిగిలిన వారిని కూడా వేర్వేరుగా ఠాణాకు పిలిపిస్తున్నట్టు సమాచారం.