ములుగు : గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటేనే కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారు. తాజాగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది.
ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతుం డగా ప్రజలు పథకాలు మాకు అందలేదని మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గెలిచాక మోసం చేసిందని ఆరోపించారు.